కేరళలోని కొచ్చిలో శనివారం ఐఎన్ఎస్ గరుడపై మెయింటెనెన్స్ ట్యాక్సీ తనిఖీలో భారత నావికాదళానికి చెందిన చేతక్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నేవీకి చెందిన గ్రౌండ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయాడు. నేవీ వర్గాల సమాచారం ప్రకారం.. నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ గరుడ రన్‌వేపై హెలికాప్టర్ టేకాఫ్ అయిన వెంటనే ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గల కారణాలను పరిశోధించడానికి విచారణ బోర్డును ఆదేశించినట్లు భారత నౌకాదళం తెలిపింది.