కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పెన్షన్ కోసం 96 ఏళ్ళ వృద్ధుడిని 40 ఏళ్ళ పాటు తిప్పించారని జస్టిస్ సుబ్రమణియమ్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధితుడు ఉత్తమ్ లాల్ సింగ్‌కు ఇవ్వాల్సిన స్వతంత్ర సైనిక్ సమ్మాన్ పెన్షన్‌ను 1980 నుంచి 6 % శాతం వడ్డీతో 12 వారాల్లోగా చెల్లించాలని ఉత్తర్వులిచ్చారు. అతను పెన్షన్ కోసం 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.