బిహార్‌లోని జహానాబాద్‌లో సిమెంట్ రోడ్డు కోసం వేసిన తడి కాంక్రీట్‌ను గ్రామస్థులు ఎత్తుకెళ్లారు. ఏకంగా మూడు కిలోమీటర్ల మేర రోడ్డును లూటీ చేసేశారు. నిర్మాణం కోసం ఉంచిన సామగ్రినీ దోచేశారు. ముఖ్యమంత్రి సడక్ గ్రామ్ యోజన కింద జహానాబాద్ జిల్లా ఔదాన్ గ్రామంలో కొత్తగా రోడ్ల నిర్మాణం చేపట్టారు. సిమెంట్ రోడ్డు వేశాక అక్కడికి స్థానికులు కొంతమంది వచ్చారు. రోడ్డును తవ్వుకుంటూ తడి కాంక్రీట్‌ను గంపల్లో తీసుకెళ్లారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రోడ్డు నిర్మాణ పనులు మూడు నెలల క్రితమే స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రస్తుతం, ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.