రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు కాంతారావు అరకులోయ మండలంలోని శనివారం సుడిగాలి పర్యటన చేశారు. మండలంలో ఎంఎల్ఎస్ పాయింట్ తనిఖీలో భాగంగా స్టాక్ బోర్డు ప్రకటించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసి సంబంధిత ఇంచార్జ్ కు సంజాయిసి నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అరకులోయ ప్రభుత్వ డిగ్రీకళాశాల గిరిజన గురుకులపాఠశాలను సందర్శించి పాఠశాలలకు సరఫరా చేస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.