విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడితే శిక్ష తప్పదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంవి శేషమ్మ హెచ్చరించారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం విశాఖ నగరంలో విద్యార్థుల న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థులకు జూవైనల్ జస్టిస్ యాక్ట్, ఫోక్సో యాక్ట్ గురించి వివరించారు. రెండవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హిమబిందు మాట్లాడుతూ పిల్లల నేరాలు నివారణపై అవగాహన కల్పించారు.