విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ పరిశీలకునిగా నియమితులైన జీవీఎంసీ 16వ వార్డుకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు మొల్లి అప్పారావును పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో వైసిపి గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.