తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వైరల్ ఫ్లూతో బాధపడుతున్నట్లు తేలింది. కొద్ది రోజులపాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. కొద్ది రోజులుగా స్టాలిన్ దగ్గు, జలుబు, జ్వరం బారిన పడ్డారని వ్యక్తిగత వైద్యులు ప్రకటించారు.