సీఎం జగన్ పేదవాడినని చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు. '1999లో ఫ్రెంచ్ కంపెనీ భారతి సిమెంట్స్‌లో షేర్లు కొనుగోలు చేసింది. ఫ్రెంచ్ కంపెనీ రూ.671 చొప్పున షేర్లు కొనుగోలు చేసింది. 14 ఏళ్ల తర్వాత భారతి సిమెంట్స్ షేర్ విలువ వెయ్యికి చేరింది. వైఎస్ భారతికి ప్రతి నెల రూ.32.50 లక్షలు జీతం రూపంలో వస్తుంది. వైఎస్ భారతికి చెక్కు రూపంలో ప్రతి నెల ఒకటో తేదీన వస్తుంది. జగన్ పేదవాడు.. మేము పెత్తందారులమా?' అంటూ వ్యాఖ్యలు చేశారు.