వరుస భూకంపాలతో ఆఫ్గనిస్థాన్ అతలాకుతలం అవుతోంది. తాజాగా ఇవాళ తెల్లవారుజామున మళ్లీ భూకంపం సంభవించింది. ఫైజాబాద్ ప్రాంతంలో తెల్లవారుజామున సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. ఫైజాబాద్ ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో 328 కిలోమీటర్ల దూరం భూకంపం సంభవించిందని అధికారులు చెప్పారు. గత వారం కూడా ఆఫ్గనిస్థాన్ దేశంలో 4.7 తీవ్రతతో భూకంపం వచ్చింది.