భారతీయ జనతా పార్టీ యువ మోర్చ జిల్లా నూతన కమిటీని ఎంపిక చేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ తెలిపారు. కమిటీ సభ్యులందరూ ఉత్సాహంతో పనిచేస్తూ పార్టీని బలమైనశక్తిగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలన్నారు. ఉరవకొండ మండలానికి చెందిన కట్టుబడి సురేష్ బాబును జిల్లా ఉపాధ్యక్షుడిగా, బాలకృష్ణను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు తెలిపారు. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు.