ఆంధ్రప్రదేశ్లో పోలీసులు వైసీపీ ప్రైవేటు సైన్యంలా మారిపోయి ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు అని నారా లోకేశ్ మండిపడ్డారు. ఎటువంటి కేసులు లేని టీడీపీ దళిత నేత, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముల్లంగి వెంకటరమణను కల్లూరు సీఐ కత్తి శ్రీనివాసులు అక్రమంగా నిర్బంధించారు. చేతులు వెనక్కి కట్టి చిత్రహింసలకు గురిచేశారని ఫైర్ అయ్యారు.