వైసీపీ ప్రైవేటు సైన్యంలా ఏపీ పోలీసులు మారిపోయి ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆటవిక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దళిత నేత ముల్లంగి వెంకటరమణను కల్లూరు సీఐ కత్తి శ్రీనివాసులును చేతులు వెనక్కి కట్టి చిత్రహింసలకు గురిచేశారని అన్నారు. సీఐపై రాష్ట్ర డీజీపీ తక్షణమే విచారణ చేసి ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు.