పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం మంత్రి రోజా పర్యటిస్తున్నట్లు మంత్రి కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. సాయంత్రం నాలుగు గంటలకు గోవింద పాలెం, సచివాలయం పరిధిలోని కామరాజనగర్ , చర్చి వీధి, ప్రాంతాలలో పర్యటిస్తారని తెలియజేశారు. స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు హాజరుకావాలని సూచించారు.