ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో భూప్రకంపనలు సంభవించాయి. ఆదివారం తెల్లవారుజామున అయోధ్యలో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది. ఉత్తర అయోధ్యలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది. ఒక వైపు అయోధ్య నగరంలో శ్రీరాముడి ఆలయం నిర్మాణం పూర్తి అయి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసుకుంటుండగా భూప్రకంపనలు సంభవించాయి.