నీటి పారుదల శాఖ ఇచ్చే వివరాల ప్రకారం రబీలో 2023 ప్రత్యామ్నాయ ప్రణాళిక తయారు చేశాం. ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగింది అని మంత్రి కాకాని తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... కరవు మండలాలను ప్రకటన విధానమే సరిగ్గా లేదని విమర్శలు చేస్తున్నారు. కరవు విధివిధానాలపై కేంద్ర ప్రభుత్వం సూచించిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ లెక్కల ప్రకారమే ప్రకటించటం జరుగుతుంది. గతంలో సాధారణ వర్షపాతం ఎంత ఉండాలి? ఎంత తక్కువ ఉందో కూడా లెక్కలోకి తీసుకుంటారు. భూమిలో తేమ శాతం ఎంత ఉందో పరిగణలోకి తీసుకుంటారు. పంట విస్తీర్ణం ఎంత ఉండేది. ఎంత తగ్గిందో పరిగణలోకి తీసుకుని డిజాస్టర్ మేనేజ్‌మెంట్, రెవిన్యూ శాఖ కరవుపై జిల్లా కలెక్టర్‌కు రిపోర్టును అందజేస్తాయి. జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికల ప్రకారం ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం 103 కరవు మండలాలను ప్రకటించటం జరిగింది అని తెలియజేసారు.