ఈనాడు శ్రీకాకుళం ప్రాంతంలో ఓ ఆస్పత్రికి ఈ ప్రభుత్వం పునాది రాయి వేస్తే, ఈ ప్రభుత్వ హయాంలో ఉపరితల జలాలు ఇవ్వాలన్న ఆలోచనకు వస్తే ఆ రెండూ ఇప్పుడు ప్రారంభానికి సిద్ధం గా ఉన్నాయి అని వైసీపీ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. అయన మాట్లాడుతూ.... ఈ నెల 23న మన జిల్లాలో పలాస ప్రాంతానికి ముఖ్యమం త్రి జగన్ వచ్చి ఆ నాడు పునాది రాయి వేసిన ఆస్పత్రి ప్రారంభానికి పూనుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ను. పరిపాలన అంటే ఓ కొత్త ఒరవడి తీసుకు వచ్చారు ఈ రాష్ట్రంలో.. మనదంతా ఉద్యమాలకు పురిటిగడ్డ లాంటిది ఈ ప్రాంతం. అనేక ఉద్యమాలు చేస్తే కానీ సమస్యలు పరిష్కారం అయ్యేవి కావు. ఏ ఉద్యమం లేకుండా ఈ రాష్ట్రంలో అనేక విషయాలపై సమూలంగా మార్పులు తీసుకు వచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది. రెండు లక్షల 30 వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని సంక్షేమ పథకాలకు అందించిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. ఎక్కడ ఒక్క ఆరోపణ ప్రజల కాదు ప్రతిపక్షాలు కాదు పత్రికలు కాదు ఏ ఒక్కరూ చేయలేకపోయారు. చంద్రబాబు కూడా చెప్పలేకపోయారు. వీటిపై విమర్శలు చేయలేరు. ఇవి మీ కార్యకర్తల జేబుల్లోకి వెళ్లిందని చంద్రబాబు కూడా ఆరోపణల చేయలేకపోయారు. చంద్రబా బుకు చెబుతున్నాను..మీరు ఆ విధంగా అనలేని విధంగా ఉందంటే పరిపాలన లో ఇవాళ వచ్చి న మార్పు ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోవాలి అని విన్నవిస్తూ ఉన్నాను అని తెలియజేసారు.