ఛైర్మన్ పదవి నుంచి మిమ్మల్ని తొలగించాలని ప్రభుత్వంలోని దళిత సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది నిజమేనా? అని విజయవాడ విలేకరులు ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్ ను ప్రశ్నించారు. ‘ఏ కులంలోనైనా, పార్టీలో అయినా వైరుధ్యాలు, కుంపట్లు ఉంటాయి. నన్ను పదవి నుంచి తొలగించాలని సీఎం జగన్ను అడిగారు. కానీ ఆయన వారి మాట వినలేదు’ అని బదులిచ్చారు.