ఖరీఫ్‌లో, రబీలో ఏ పంటలు వేస్తారు. ఏ కాలువ కింద ఆయకట్టు సాగు అవుతుందో తెలియని వ్యక్తి లోకేశ్ కూడా వ్యవసాయంపై లేఖలు రాస్తారు. అసలు వ్యవసాయం, రైతుల సమస్యలపై లోకేశ్‌కు అవగాహన ఉందా? చర్చించగలవా? అని మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నాయని రైతులను రెచ్చగొట్టాలని ఓట్లు దండుకోవాలని దుర్మార్గమైన ఆలోచనతో లోకేశ్ నాయుడు, అచ్చెన్నాయుడు లేఖలు రాసారని తెలిపారు.