ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా హీరాలాల్ సమరియా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో సమరియాతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. దీంతో సీఐసీగా బాధ్యతలు చేపట్టిన తొలి దళిత వ్యక్తిగా హీరాలాల్ సమారియా నిలిచారు. మాజీ ఐఏఎస్, ప్రస్తుతం సమాచార కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న సమరియాను ప్రధాని మోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం తదుపరి సీఐసీగా ఎన్నుకుంది.