దారుణాలకు పాల్పడుతున్న వారిని శిక్షించకుండా, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెడుతున్న జగన్‌రెడ్డి ప్రజాగ్రహాన్ని చవిచూడటం ఖాయం అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..... పదవుల కోసం సొంత జాతిని బలి పెడుతున్న దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్ కాళ్ల దగ్గర దళిత జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. వైసీపీ నేతలు, మంత్రులు నడిరోడ్లపై మీటింగ్‌లు పెట్టినా, ప్రజల్ని ఇబ్బంది పెట్టి, బస్సు యాత్రలు నిర్వహించినా పట్టించుకోని పోలీసులు... టీడీపీ ఏ కార్యక్రమం చేపట్టినా శాంతిభద్రతల పేరుతో మా నేతల్ని ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా గృహ నిర్బంధాలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.