వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్ర నేడు విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. గాజువాక సెంటర్లో మధ్యాహ్నం గం. 12.30ని.లకు యాత్ర ప్రారంభం కానుంది. ఒంటి గంటకు టీఎన్ఆర్ కళ్యాణ మండపం వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. నూతనంగా ఏర్పాటు చేసిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు టీఎన్ఆర్ కళ్యాణ మండపం నుంచి పాత గాజువాక వరకూ భారీ ర్యాలీ కొనసాగనుంది. సాయంత్రం 4 గంటలకు పాత గాజువాకలో భారీ బహిరంగ సభ జరుగనుంది. దీనికి మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, బొత్ససత్యనారాయణ తదితరులు హాజరుకానున్నారు.