ధర్మవరం పట్టణంలోని నేత్రాలయ ఐ క్లినిక్ నందు సోమవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 110 మంది ఉచిత కంటి ఆపరేషన్లకు ఎంపికైనట్లు డిఓఏ ఏం. నాగరాజు ఆచారి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ. కడప పుష్పగిరి కంటి ఆసుపత్రి వారిచే నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి 120 మంది హాజరవ్వగా, 110 మంది ఉచిత కంటి ఆపరేషన్లకు ఎంపికయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి. శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.