పార్లమెంట్లో ఆమోదం పొందిన మహిళ రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు తీరని అన్యాయం జరిగిందని అనకాపల్లి జిల్లా బిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పి. రామ్మోహన మురళి అన్నారు. సోమవారం నర్సీపట్నంలో ఆయన మాట్లాడుతూ 15 శాతం ఉన్న ముస్లిం మైనార్టీ మహిళలకు కూడా అన్యాయం జరిగిందన్నారు. మహిళ సాధికారత లక్ష్యంగా బిల్లును ప్రవేశపెట్టామని ప్రభుత్వం చేసిన వాదనలో పసలేదన్నారు. దీనిపై నర్సీపట్నం ఆర్టీవో జయరాంకు ఫిర్యాదు చేశారు.