జగన్ పాలనలో ఆయన సొంతపార్టీ కార్యకర్తలకే రక్షణ లేకుండా పోయిందని నారా లోకేశ్ విమర్శించారు. 'మడకశిర నియోజకవర్గం రావూరు పంచాయితీ వాలంటీర్ వేదపై వైసీపీ ఎంపీటీసీ హత్యాయత్నంతో పాటు అత్యాచారయత్నానికి పాల్పడటం దారుణం. స్థానిక ఎమ్మెల్యే ఇదంతా చేయిస్తున్నారని బాధితురాలు చెబుతోంది. బాధిత వాలంటీర్ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటే.. సామాన్య మహిళలకు జగన్ పాలనలో రక్షణ లేదని స్పష్టం అవుతోంది' అని ట్వీట్ చేశారు.