బిహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీ వర్కర్లు ఆందోళనకు దిగారు. న్యాయపరమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని నిరసనకు దిగారు. బిహార్లో ఉన్న విధాన సభ భవనం వద్దకు అంగన్వాడీలు చేరుకుని నిరసనలు చేపట్టారు. దాంతో అక్కడ తీవ్ర ఉధ్రిక్తత నెలకొంది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. కానీ ఆందోళన తీవ్రతరం అవ్వడంతో ఫైర్ ఇంజిన్ను రప్పించుకుని నీటిని ప్రయోగించి వారిని చెదరగొట్టారు.