రైతన్నకు తోడుగా జగనన్న.. పెట్టుబడి కోసం ఏ రైతన్న అప్పులపాలు కాకుండా వైయస్ఆర్ రైతు భరోసా ద్వారా మూడు విడతల్లో ఏటా రూ.13,500 పెట్టుబడి సాయంగా అందిస్తున్నారు. వ్యవసాయం దండగ అనే గత పరిస్థితులను సమూలంగా మార్చి వ్యవసాయాన్ని పండుగ చేసి రైతన్నలకు అడుగడుగునా వెన్నుదన్నుగా నిలుస్తూ చెప్పిన దాని కన్నా ముందుగా, మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా.. రైతన్నలకు సాయం అందిస్తున్నారు. మేనిఫెస్టోలో ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేల సాయం అందిస్తామన్న హామీకి మిన్నగా.. ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 చొప్పున అంటే మేనిఫెస్టోలో చెప్పిన దాని కంటే రైతన్నకు అదనంగా రూ.17,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు.