వైసీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా మార్కాపురంలో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ..... రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మూడున్నర కోట్లకు పైగా ఉన్నారు. ఈరోజు వారి గురించి ఆలోచించి, అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం వారికి అన్ని రకాల హక్కుల కల్పిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. వెనకకు నెట్టివేయబడ్డ మన కులాలవారిని ముందుకు తీసుకువచ్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మనం ఎంత వరకు మేలు పొందామో ఆలోచించాలి. అలా చేస్తే..పేద బడుగుబలహీన వర్గాలంటే ప్రేమించే జగనన్న మనకిచ్చిన సంక్షేమపథకాల లబ్ది ఎంతో అర్థమవుతుంది. వెలిగొండ ప్రాజెక్టు డిసెంబర్లోగా పూర్తి చేసి, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా సంకల్పించారు ముఖ్యమంత్రి జగన్. జగనన్న పాలనలో ఈ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుండటం ఎంతో సంతోషించాల్సిన విషయం. అంబేద్కర్, జ్యోతిరావు పూలే ఆదర్శాలను పాటిస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. కేబినెట్లో, నామినేటెడ్ పోస్టుల్లో దళితులు, బీసీలు, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చారు జగన్మోహన్రెడ్డి. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పే చంద్రబాబు ఎక్కడ...ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూ, పేద, బడుగు, బలహీనువర్గాలను ఎంతో బలోపేతం చేసిన, చేస్తున్న జగనన్న ఎక్కడ? ఇద్దరికీ అసలు పోలికే లేదు అని తెలిపారు.