వైసీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.... బీసీలకు అత్యధికంగా పదవులిచ్చిన జగనన్న. మార్కెట్ యార్డు చైర్మన్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలున్నారు. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అని చెప్పగలిగే సీఎం జగనన్న మాత్రమే. అయ్యప్పమాల వేసుకొని చెబుతున్నా. ఆ నాయకుడి కింద పని చేయడం ఏ జన్మలో పుణ్యమో. పక్కనోడు సీఎం అవ్వాలని పార్టీ పెట్టే వ్యక్తి మనకు అవసరమా? ఇక్కడేమో టీడీపీతో అంటాడు, తెలంగాణలో బీజేపీతో పొత్తు. టీడీపీకి అక్కడేమో కాంగ్రెస్తో లోపాయికారీ ఒప్పందం. మళ్లీ మనం వెనక్కి పోదామా ముందుకు పోదామా అని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా ఆలోచన చేయాలి అని అన్నారు.