వైసీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.... చంద్రబాబు వల్ల మోసపోయిన సామాజిక వర్గాలు ఇప్పుడు పురివిప్పుతున్నాయి. – చంద్రబాబు రైతుల్ని మోసం చేశాడు. డ్వాక్రా అక్కచెల్లెమ్మల అప్పులు తీరుస్తానని మోసం చేశాడు. చంద్రబాబుకు కేవలం ఆయన కులం మాత్రమే కనపడుతుంది. కానీ జగనన్నకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు కనపడతారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తే దాని ఫలాలు ప్రజలకు అందిస్తున్నవ్యక్తి జగనన్న. చంద్రబాబు ప్రజలను మరోసారి మోసం చేసేందుకు రామోజీ, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు, పవన్ కల్యాణ్‌ను కలుపుకొని పోతున్నాడు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు జగనన్న వద్ద ఉన్నారు.