వైసీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.... కేబినెట్‌లో బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులు 17 మంది ఉన్నాం. ఏ కార్పొరేషన్, మేయర్, మున్సిపల్ చైర్మన్ చూసినా అందరికీ అవకాశాలు మెండుగా ఇచ్చారు. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి, జ్యోతిరావుపూలే ఆలోచనలు, జగ్జీవన్ రామ్ పాలనాదక్షత వల్ల జగనన్న సామాజిక న్యాయం చేయగలిగారు. దళిత మహిళగా హోంమంత్రిగా మీ ముందు నిలబడి ఉన్నానంటే రాష్ట్రంలో సామాజిక సాధికారత సాధించామని చెప్పడానికి గర్వపడుతున్నా. జగనన్నకు ముందు, జగనన్నకు తర్వాత అని మాట్లాడేలా సామాజిక న్యాయం పాటించి మనందర్నీ గౌరవించి, స్థానం కల్పించిన జగనన్న. దళితుల పక్షాన జగనన్న నిలబడి ధైర్యాన్ని ఇచ్చారు. బలహీనుల పక్షాన నిలబడి వారికి బలమయ్యారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇలా ధైర్యాన్నిఇవ్వలేదు అని అన్నారు.