సుప్రీం కోర్టులో మంగళవారం ఓట్లపై అవకతవకలు ఉన్నాయని వచ్చిన పిర్యాదు విచారణకు వచ్చింది. అయితే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. గతంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసినందున ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రకటించారు. ఏపీలో దొంగ ఓట్లపై మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని సిటిజెన్స్ ఫర్ డెమొక్రసీ పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రకటించారు. దీంతో సీజేఐ ఆదేశాలతో మరో ధర్మాసనం ముందు లిస్ట్ చేయాలని రిజిస్ట్రీకి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు.