చీరాల మండలం ఈపూరుపాలెంలో ఇసుక అక్రమ తవ్వకాలపై నిశితంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం చీరాలలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలపై పలు ఫిర్యాదులు అందుతున్నాయని, రెవెన్యూ, మైనింగ్ యంత్రాంగం దీనిపై దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.