విజయనగరం జిల్లా, పార్వతీపురం , జియ్యమ్మవలస మండలంలో విషాదం జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే.... బొడ్డవలస గ్రామానికి చెందిన కె..అఖిల, అదే మండలంలోని అప్పన్న దొరవలసకు చెందిన మాధురి బొబ్బిలి ఒకేషనల్ కళాశాలలో చదువుతూ స్నేహి తులయ్యారు. 4 నెలలక్రితం బంధువుల ఫంక్షన్కు వెళ్తానని చెప్పి అఖిల చెవిదుద్దులను మాధురి తీసుకువెళ్లింది. ఇంతలో అఖిల తల్లి మంగమ్మ చెవిదుద్దులు ఎక్కడ అని నిలదీసింది. దీంతో మాధురి వద్దకు వెళ్లి చెవిదుద్దులు ఇవ్వాలని అఖిల కోరడంతో ‘నేను ఇవ్వను.. ఎవ్వరితో చెప్పుకుంటావో చెప్పుకో’ అని అనడంతో సోమవారం ఇంటిలో ఉన్న ప్రమాదకర మాత్రలు మింగింది. గుర్తించిన కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి ఫిర్యా దును స్వీకరించినట్లు ఔట్ పోస్టు పోలీసులు తెలిపారు.