ఇద్దరు ప్రభుత్వ మహిళా ఉద్యోగులపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసును సోమవారం జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్ రమణ చినగంజాం లో విచారించారు. పంగులూరు మండలానికి చెందిన ధనలక్ష్మి, నాగరాజకుమారి అనే ఇద్దరు వీఎవోలు తాను వారితో కలిసి పని చేసినప్పుడు నెలకొన్న విభేదాల నేపథ్యంలో చినగంజాం వచ్చి తనను కులం పేరు పెట్టి దూషించారని చినగంజాం వెలుగు పథకం సీసీ శ్రీలక్ష్మి చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైందని ఎస్సై సురేష్ చెప్పారు.