విశాఖ ఉక్కు పరిరక్షణ, కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు మద్దతుగా ఇవాళ విద్యాసంస్థల బంద్ చేపట్టనున్నట్లు PDSU, AISF, AIYF సంఘాలు ప్రకటించాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటానికి రేపటితో వెయ్యి రోజులు పూర్తి కానున్నందున కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ బంద్ చేపట్టనున్నట్లు తెలిపారు. అన్ని యువజన, విద్యార్థి సంఘాలు ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనాలని ఆయా సంఘాలు పిలుపునిచ్చాయి.