కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పెను ప్రమాదం తప్పింది. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆయన మంగళవారం వెళ్లారు. ఆయన ప్రచార రథం పై భాగానికి విద్యుత్ వైర్లు తాకాయి. అధికారులు వెంటనే అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. దీంతో ర్యాలీని అమిత్ షా ఆపేశారు. ఓ బహిరంగ సభలో ప్రసంగించేందుకు వెళ్లిపోయారు. ఈ ప్రమాదంపై సీఎం అశోక్ గెహ్లాట్ దర్యాప్తునకు ఆదేశించారు.