ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.294.67కోట్ల నికర లాభాన్ని అర్జించింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.226.03కోట్లతో పోలిస్తే 30.36శాతం వృద్ధి చెందింది. ఐఆర్సీటీసీ మొత్తం ఆదాయం రూ.805.80కోట్ల నుంచి రూ.995.31కోట్లకు పెరిగింది. ఆదాయంలో 23.5శాతం వృద్ధి నమోదైంది.