ప్రజలు తమ ఆస్తుల రిజిస్ట్రేషన్లను సులభంగా చేసుకునేలా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం కార్డ్ ప్రైమ్. ఇటీవల ఏపీలోని నంద్యాల, విశాఖ, అనకాపల్లి, తిరుపతి జిల్లాలోని 51 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానం ప్రారంభించారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని 24 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఈ విధానాన్ని అమలు చేశారు. అక్కడ సక్సెస్ కావడంతో దశల వారీగా ప్రారంభిస్తున్నారు.