వ్యాపారం చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకునే మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం వుమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షణలో 'ఉద్యోగిని' పథకం అమలు చేస్తోంది. దీని ద్వారా రూ.3 లక్షల వరకు వడ్డీ లేని రుణం పొందొచ్చు. దివ్యాంగ, వితంతు మహిళలు అర్హతను బట్టి రూ.3 లక్షల కంటే ఎక్కువ పొందొచ్చు. 18 నుంచి 55 ఏళ్లలోపు మహిళలు దీనికి అర్హులు. క్రెడిట్/సిబిల్ స్కోర్ బాగుండాలి. సమీపంలోని బ్యాంకులను సంప్రదించాలి.