రెండు రోజుల క్రితం విజయవాడ బస్టాండులో జరిగిన బస్సు ప్రమాద ఘటన మరవకముందే మరోసారి బస్సు బీభత్సం చేసింది . విజయవాడలోని గవర్నరుపేట గ్యారేజ్‌లో సిటీ బస్సును డ్రైవర్ వేగంగా రివర్స్ చేశాడు. దీంతో అక్కడే కార్గో వారోత్సవాల బ్యానర్లు కడుతున్న ఓ ఉద్యోగి పైకి బస్సు దూసుకెళ్లింది. ఉద్యోగి కాలు మీద టైర్ ఎక్కడంతో అతని కాలు విరిగిపోయింది. వెంటనే అతడిని స్థానికులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa