ఎన్నికల సంఘాన్ని బుధవారం ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కలవనున్నారు. ఏపీలో ఓట్ల అవకతవకలపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు టీడీపీ ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. నియోజకవర్గాల వారీగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లన్ని తొలగించారనే అంశంపై డేటాను ఎన్నికల అధికారికి ఇవ్వనుంది. ఫాం-7ను దుర్వినియోగం చేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఎన్నికల అధికారికి స్పష్టం చేయనున్నారు.