ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో మంగళవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కేసరిపడ గ్రామానికి చెందిన బద్రి కేత్రాడు (32)ను సొంత అన్నలే హత్య చేశారు. మారణాయుధాలతో ఎడమ కాలుని శరీరం నుంచి వేరు చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఖేత్రి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మృతుడికి ఏడాది కిందట ఒడిశా రాష్ట్రానికి చెందిన శిరీషతో వివాహమైంది. మూడు రోజుల కిందట ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.