ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 08, 2023, 01:41 PM

రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ప్రభుత్వం చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో ప్రతిపక్షం ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తోందని, ప్రతి విషయాన్ని రాజకీయ రంగు పులిమి కుట్రలు చేస్తోందని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత మండిపడ్డారు. అందులో భాగంగానే విజయవాడ సమీపంలోని కంచికచర్ల రాజీవ్ నగర్ కి చెందిన కాండ్రు శ్యాంకుమార్ ఘటనని వాడుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ ఘటనలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించినా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు లేనిపోని బురద చల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని ఆమె తెలిపారు. కొవ్వూరు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. రాష్ట్రం వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ  నిర్వహిస్తున్న సామాజిక సాధికార యాత్ర అద్భుతంగా సాగుతోందని, అది చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష టీడీపీ అబద్దపు ప్రచారాలతో, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com