ఏపీ లో దారుణం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో బుధవారం కన్న తల్లే కుమారుడితో కలిసి కన్నకూతురిని చంపడం కలిచివేసింది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం. కోమల(17) అనే యువతి పెద్దలు చూసిన సంబంధం కాదని, నచ్చినవాడిని పెళ్లి చేసుకుంటానంటూ ఆమె మారాం చేయడంతో ఆగ్రహించిన తల్లి, సోదరుడు యువతిని చితకబాదారు. అంతటి ఆగకుండా చున్నీతో గొంతు బిగించి హతమార్చారు.