విభిన్న ప్రతిభావంతుల్లోనూ డిజిటల్ విద్యా కుసుమాలు విరబూయాలని జిల్లా కలెక్టర్ ఎం. గౌతమి ఆకాంక్షించారు. బుధవారం అనంతపురం నగరంలోని పంగల్ రోడ్ లో ఉన్న ఆర్డీటీ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్లో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ట్యాబ్ లను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు కూడా ట్యాబ్ లను ఉపయోగించాలని సూచించారు.