ఎల్‌నినో కారణంగా భూ ఉపరితలం, సముద్ర జలాలపై ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాజాగా వెల్లడించింది. ‘జులై-ఆగస్టులో ఎల్‌నినో మార్పులు వేగాన్ని అందుకుంటాయని, నవంబర్‌లో బలంగా మారి.. జనవరి 2024 నాటికి ఎల్‌నినో అత్యంత గరిష్ట స్థాయికి చేరుకుంటాయని పేర్కొంది. దీని ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఉంటుందని, 2024లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేసింది.