మానవ అక్రమ రవాణా ముఠాలపై NIA బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఉదయం నుంచి దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో సోదాలు జరిగాయి. తెలంగాణలో ఒకరిని అరెస్టు చేయగా, మిగిలిన 9 రాష్ట్రాల్లో 43 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.20 లక్షల నగదు, 4,550 అమెరికన్ డాలర్లు, డిజిటల్ పరికరాలు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులతో పాటు నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.