కావలి పట్టణం తుఫాన్ నగర్ కు చెందిన దేవరకొండ సుధీర్ ఇంట్లో 100 మంది పోలీసులు గురువారం తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ బస్ డ్రైవర్ పై దాడి ఘటనలో సుధీర్ ప్రధాన నిందితుడు. తక్కువ ధరకే బంగారం, నోట్ల మార్పిడి తో సహా పలు కేసులు సుధీర్ పై ఉన్నాయి. అనేకమంది బాధితులు ఇటీవల జిల్లా ఎస్పీని కలసి స్పందనలో అర్జీలు ఇవ్వడం జరిగింది. దీనితో 100 మంది బెటాలియన్ పోలీసులు నెల్లూరు నుండి వచ్చి తనిఖీలు చేపడుతున్నారు.