వచ్చే ఏడాది కూడా ఎల్‌నినో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) ప్రకటించింది. దీని ప్రభావం నైరుతి రుతుపవనాలపై ఉండకపోవచ్చు. ఎల్ నినో ప్రభావంతో దేశంలో ఈ ఏడాది సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ నెల నుండి జనవరి 2024 వరకు, ఎల్ నినో ప్రభావం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అసాధారణంగా వేడెక్కుతున్న పసిఫిక్ సముద్ర జలాల వల్ల ఈ పరిస్థితులు ఏర్పడతాయి.