గాజాలో పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడ పనిచేసే నర్సు ఎమిలీ కల్లాహన్ మాట్లాడుతూ ప్రజలు వైద్యం, ఆహారం, నీరు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దాదాపు 50 వేల మందికి 4 మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రులన్నీ క్షతగాత్రులు, రోగులతో నిండిపోయాయని అన్నారు. రోజుకు 4 గంటలు మాత్రమే నీటి సరఫరా జరుగుతుందని తెలియజేశారు.